Government Job Notification: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్ : ఐసీడీఎస్ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19, 20 వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం కౌన్సిలర్, అవుట్‌రిచ్ వర్కర్ పోస్టు ఉద్యోగాలను ఈ నెల 19న , మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న పోస్టులకు 20 న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.
Government Job Notification
పోస్టుల వారీగా అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను www.chittoor.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసినట్లు వివరించారు. అభ్యర్థులు ఒరిజనల్ గుర్తింపు కార్డు, విద్యార్థత సర్టిఫికెట్‌లు, అనుభవం, కుల ధ్రువీకరణపత్రాలతో కలెక్టరేట్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.