Skip to main content

How To Get Rs 1 crore Salary Jobs: ఏడాదికి కోటి రూపాయల జీతం.. ఇలాంటి కోర్సులు చేస్తే చాలు

ఏడాదికి కోటి రూపాయల జీతం పొందాలంటే ఎలాంటి కోర్స్‌ చదవాలి?ఎలాంటి కంపెనీలలో జాబ్స్ తెచ్చుకోవాలి?.. చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. తాజాగా ఒకతను ఇదే సందేహాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో ''నాకు తెలుసు ఐటీలో చాలామంది కోట్లలో జీతాలను పొందుతున్నారు. అలాంటి ఉద్యోగాలు వారికి ఎలా దొరుకుతున్నాయనేది నా ప్రశ్న?. నేను ఇంటర్వ్యూలకు గట్టిగా సిద్దమవుతున్నాను. అలాంటి జాబ్స్ కోసం ఎక్కడ వెతకాలి? జాబ్ మార్కెట్‌లో ఏడాది 40 లక్షల కంటే ఎక్కువ జీతం నాకు కనిపించలేదు'' అని ఉంది.
How To Get Rs 1 crore Salary Jobs
How To Get Rs 1 crore Salary Jobs

ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ కావడంతో.. పలువురు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాను. రోజు ఉదయం 9:30 గంటలకు లాగిన్ అయ్యి.. సాయంత్రం 4 గంటలకు లాగవుట్ అవుతాను. ఇలాంటి జాబ్ నా స్నేహితుడు.. ఇండియాలో చేస్తున్నాడు. అతడి జీతం తక్కువ. కాబట్టి నాకు ఈ ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

Job Interview For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో జాబ్‌

software jobs - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on software  jobs | Sakshi

అప్పుడే ఎక్కువ జీతం

ఉద్యోగంలో చేరాలి, పని చేయడంలో తనను తానూ నిరూపించుకోవాలి, తొందరగా పదోన్నతులు పొందాలి. అప్పుడే ఎక్కువ జీతం లభిస్తుందని మరో నెటిజన్ అన్నారు. నాకు ఏడాది 10 లక్షల రూపాయలు లభించే ఉద్యోగాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా రావడం లేదని మరో నెటిజన్ వాపోయాడు. ఇలా ఎవరికి తోచిన రీతిలో.. వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

software jobs - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on software  jobs | Sakshi
ఎక్కువ జీతాలు అందించే కంపెనీలు


గూగుల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, అమెజాన్, అడోబ్, ఎన్వీడియా, సిస్కో, జునిపెర్, ఫేస్‌బుక్ మొదలైన కంపెనీలు అత్యధిక వేతనాలు అందించే కంపెనీల జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ కంపెనీలలో కూడా ఎవరికిపడితే వారికి అధిక వేతనాలు ఉండవు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Upcoming Job Fair: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉద్యోగమేళా.. ఎప్పుడంటే..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Feb 2025 09:58AM

Photo Stories