Infosys Layoffs: ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్..700 మందిని తొలగింపు

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీలో చేర్చుకున్న ఫ్రెషర్లలో 700 మంది.. మూడు సార్లు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఈ కారణంగానే వారిని బయటకు పంపుతున్నట్లు సమాచారం. వీరందరూ కూడా కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్‌కు చెందిన వారని తెలుస్తోంది.
JNTUA Btech Results Out: బీటెక్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌తో ఇలా చెక్ చేసుకోండి
కంపెనీలో ట్రైనింగ్ తీసుకునే ఫ్రెషర్స్ కచ్చితంగా.. సంస్థ నిర్వహించే అసెస్‌మెంట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే కంపనీలో కొనసాగలేరు. ఈ విషయాన్ని ఆఫర్ లేటర్లలో కూడా స్పష్టం చేశామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ విధానం ఇప్పుడు ప్రారంభించింది కాదు. గత రెండు దశాబ్దాలుగా కంపెనీ ఈ పద్దతిలోనే ఉద్యోగులను ఎంపిక చేస్తోందని పేర్కొంది.
Bank Jobs Recruitment 2025: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే బ్యాంకు ఉద్యోగం.. నెలకు రూ. 1,75,000/-
లేఆఫ్‌లకు ప్రభావితమైన ఉద్యోగులలో చాలామంది 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందినవారు. వీరందరూ కంపెనీ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందారు. వీరి ఇంటర్వ్యూలో పూర్తయిన తరువాత ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి కూడా కంపెనీ చాలా సమయం తీసుకుందని గతంలోనే వెల్లడైంది.
ఆ తరువాత ఆఫర్ లెటర్స్ అందిస్తూ.. సిస్టమ్ ఇంజనీర్ ఉద్యోగులకు రూ. 3.2 లక్షల నుంచి రూ. 3.7 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుందని హామీ ఇచ్చారు.అయితే కంపెనీ లేఆఫ్‌లను నాసెంట్ ఐటీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) విమర్శించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ట్రైనింగ్ సమయంలోనే బయటకు పంపించడం అనేది సమంజసం కాదని పేర్కొంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)