Skip to main content

CM Revanth Reddy Attends Mock Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎస్‌సీఈఆర్‌టీలో నిర్వహించిన అండర్‌–18 విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం  మాట్లాడుతూ... మాక్‌ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని తెలిపారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు.
CM Revanth Reddy Attends Mock Assembly
CM Revanth Reddy Attends Mock Assembly

రాష్ట్ర అసెంబ్లీలో లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌, లీడర్‌ ఆఫ్‌ ది అపొజిషన్‌ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. సభలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు. ‘'విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు.

children mock assembly

వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. 

children mock assembly

ఎన్నికల్లో శాసనసభకు  పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. అదే విధంగా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముంది.

children mock assembly

21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దీని వల్ల యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు... 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా.చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్‌ను  పాస్ చేయడం అభినందనీయం’' అని తెలిపారు.

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 15 Nov 2024 04:24PM

Photo Stories