Nissan Company Layoffs: ఉద్యోగులకు షాక్.. 9000 మందిని తొలగించనన్న నిస్సాన్ కంపెనీ..
Sakshi Education
జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నిస్సాన్ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా 9000 మంది ఉద్యోగులకు తొలగించనున్నట్లు ప్రకటించింది.
నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలకు సిద్ధమైంది. సెపె్టంబర్ త్రైమాసికంలో కంపెనీ 9.3 బిలియన్ యెన్‌ల నష్టాన్ని మూటగట్టుకుంది.
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో 1000 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది.
Screening Test for Free DSC Training: ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
అంతేకాకుండా తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 08 Nov 2024 01:21PM
Tags
- Layoffs
- job layoffs
- Layoffs 2024
- Nissan
- Nissan layoffs
- Car Manufacturing company
- 9000 layoffs
- Nissan Cuts 9000 Jobs
- Japanese car making company
- Nissan to Cut 9000 Jobs
- nissan company layoff news
- Japanese car company
- Japanese car manufacturers layoffs
- Nissan global layoffs
- global job cuts Nissan
- Nissan layoffs 2024
- car manufacturing layoffs
- jobs layoffs news