Skip to main content

Erupting Volcanoes : చందమామ ఆవలి వైపు కూడా అగ్నిపర్వతాలకు నిల‌య‌మే.. శాస్త్ర‌వేత్త‌ల నిర్ధార‌ణ!

Moon's far side once had erupting volcanoes discovered china scientists

న్యూయార్క్‌: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిపర్వతాలకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్‌ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూనాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు.

Minister of Health : ప్రజారోగ్యం విషయంలో ట్రంప్ కీలక నిర్ణ‌యం.. మ‌రో మంత్రిగా..!

‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఇప్పటికీ మిస్టరీయే...

చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూనివర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణుడు క్రిస్టోఫర్‌ హామిల్టన్‌ అన్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Nov 2024 04:20PM

Photo Stories