Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్
Sakshi Education
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 38 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు.
తన కెరీర్‌లో 106 టెస్టులు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించాడు. లెజెండరీ ఆనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రెండో అత్యధిక వికెట్ల సంఖ్య.
3000 పరుగులు, 300 వికెట్లు సాధించిన 11 అల్‌రౌండర్లలో అశ్విన్ ఒకరిగా నిలిచాడు. అంతేకాకుండా.. అతను 11 "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్" అవార్డులు కూడా గెలిచాడు. ఇది ముత్తయ్య మురళీధరన్‌తో సమానంగా ఉంది.
టీమిండియా తరఫున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మొత్తం 4,400 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరాడు.
Published date : 18 Dec 2024 12:37PM