Junior Hockey Asia Cup: జూనియర్ ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా
Sakshi Education
వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్‌గా టీమిండియా నిలిచింది.
మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో డిసెంబర్ 15వ తేదీ జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు.
‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా.. వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్‌దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్‌లను భారత గోల్‌కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.
National Championship: జార్ఖండ్.. జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ విజేత
Published date : 16 Dec 2024 06:26PM