Skip to main content

Ira Bindra: రిలయన్స్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా నియామకం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ గ్రూప్‌ మానవ వనరుల (హెచ్‌ఆర్‌) ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా(47)ను నియమిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు.
Mukesh Ambani appoints Ira Bindra as Group President for HR at Reliance

ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వివరాలను ముఖేశ్‌ నేరుగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఇరా బింద్రా ఇప్పటివరకు యూఎస్‌లోని మెడ్‌ట్రానిక్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఆమె హెచ్‌ఆర్‌ విభాగాధిపతిగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లో అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించి టాప్‌ మేనేజ్‌మెంట్‌ నియామకాలను ఈమె చేపట్టబోతున్నారు. కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఈమె రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మొదటి కుటుంబేతర మహిళ కావడం విశేషం.

  1. 1998లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి బింద్రా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.
  2. 1999లో నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.
  3. తర్వాత ఆమె మెడ్‌ట్రానిక్‌లో చేరడానికి ముందు జీఈ క్యాపిటల్, జీఈ ఇండియా, జీఈ హెల్త్‌కేర్, జీఈ ఆయిల్ & గ్యాస్‌లో పనిచేశారు.

Bank of China: బ్యాంక్‌ ఆఫ్‌ చైనా డైరెక్టర్‌గా నియ‌మితులైన తెలుగు మహిళ

Published date : 16 Dec 2024 05:29PM

Photo Stories