Skip to main content

Year Ender 2024: ఈ ఏడాది ప్రధాని మోదీ పర్యటించిన దేశాలు ఇవే..

2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప‌లు దేశాలను పర్యటించారు.
List Of International Prime Ministerial Trips Made By PM Narendra Modi

మోదీ పర్యటించిన ఈ ప్రాంతాలకు సామాన్యులు కూడా తక్కువ బడ్జెట్‌తో వెళ్లిరావచ్చు. అవి ఏవో ఇక్క‌డ తెలుసుకుందాం. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

UAE


ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అరబ్‌ దేశంలోని బీఏపీఎస్‌ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. భారత్‌- యూఏఈ మధ్య  పలు  ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను ప్రధాని మోదీ సందర్శించారు. టూరిజంరంగంలో యుఎఈ మరింతగా విస్తరిస్తోంది. దీంతో విదేశాల్లో పర్యటించాలనుకునేవారికి యూఏఈ మొదటి ఎంపికగా మారింది. ఈ దేశంలోని దుబాయ్ నగరాన్ని దర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ప్రతి ఏటా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన పర్యాటకులు యూఏఈని చూసేందుకు తరలివస్తుంటారు.

భూటాన్
 

Bhutan


భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్‌గే ఆహ్వానం మేరకు ఈ ఏడాది నరేంద్ర మోదీ భూటాన్‌లో పర్యటించారు. భూటాన్ భారత్‌కు పక్కనేవున్న పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది. తక్కువ బడ్జెట్‌లో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి భూటాన్‌ సందర్శన ఉత్తమ ఎంపిక. వీసా లేకుండా భూటాన్‌లో 14 రోజుల పాటు ఉండేందుకు భారతీయులకు అనుమతి ఉంది. భూటాన్‌ వెళ్లేవారు అక్కడి అందమైన అడవులను, దేవాలయాలను సందర్శించవచ్చు.

ఇటలీ
50వ జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఈ ఏడాది ఇటలీలో పర్యటించారు. ఐరోపాలోని ఇటలీ అందమైన దేశంగా పేరొందింది. సినీతారలు ఇటలీని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు  ఇటలీకి తరలివస్తుంటారు. చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇటలీని సంద్శించాలని భావిస్తుంటారు. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్, అమాల్ఫీ కోస్ట్  మొదలైనవి చూడదగిన ప్రాంతాలు.  

రష్యా

Russia


22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాది రష్యాలో పర్యటించారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. భారీ పర్వతాలు, ఎడారులు, అందమైన బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలు, రాజభవనాలు, మంచుతో నిండిన సరస్సులను ఈ దేశంలో చూడవచ్చు. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో రష్యా  ఒకటి. ఇక్కడి మాస్కో, వ్లాడివోస్టాక్ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.

సింగపూర్

Singapur


ఈ ఏడాది ప్రధాని మోదీ సింగపూర్‌లో పర్యటించారు. సింగపూర్ సంపన్న దేశంగా పేరొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు సంగపూర్‌ సందర్శనకు వస్తుంటారు. ఇక్కడి అందమైన మ్యూజియం, జురాంగ్ బర్డ్ పార్క్, రెప్టైల్ పార్క్, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్ సెంటోసా ఐలాండ్, పార్లమెంట్ హౌస్, హిందూ, చైనీస్,  బౌద్ధ దేవాలయాలు, చైనీస్, జపనీస్ గార్డెన్‌లు చూడదగిన ప్రదేశాలు. విదేశాలను సందర్శించాలనుకునేవారికి సింగపూర్‌ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.

Best Food Cities: ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార నగరాలు ఇవే.. టాప్‌-5లో ముంబై

Published date : 18 Dec 2024 09:56AM

Photo Stories