PM Modi: నారీ శక్తికి నా నమస్సులు.. మహిళా దినోత్సవంలో ప్రధాని మోదీ

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహిళల గౌరవాన్ని సమాజ ప్రగతి దిశగా తొలి అడుగుగా పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం, భద్రత, సాధికారత కోసం ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. "నారీ శక్తికి నా నమస్సులు" అని ఆయన అన్నారు.
మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయడానికి కఠిన చట్టాలు అమలు చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రత్యేకంగా, అత్యాచారం వంటి దారుణ నేరాల కోసం మరణశిక్షను ప్రవేశపెట్టడం, మహిళలకు సత్వర న్యాయం అందించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు.
తన ప్రపంచంలోని సంపన్నతను మహిళల ఆశీస్సుల రూపంలో భావించారన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "కోటి పడి తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను సంపన్నుడిని" అని మోదీ చెప్పారు.
Mahila Samridhi Yojana: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2500 ఇవ్వనున్న ప్రభుత్వం
ఈ సందర్భంగా.. మహిళా ప్రముఖులు తమ విజయగాథలను పంచుకున్నట్లు కూడా వెల్లడించారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ వంటి మహిళలు తమ అనుభవాలను మరియు విజయాలను పంచుకున్నారు.
మహిళా పోలీసుల రక్షణ
నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తి మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించింది. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్‌స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి.