NTA : ఎన్‌టీఏ.. ఇకపై ఈ పరీక్షలకు మాత్రమేనా.. కేంద్ర విద్యాశాఖ కీలక ప్రకటన..
సాక్షి ఎడ్యుకేషన్: యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు రాసే పరీక్షలను నిర్వహించే ఎన్‌టీఏ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇకపై కేవలం ఉన్నత విద్య పొందేందుకు విద్యార్థులు రాసే కామన్ ఎంట్రెన్స్ టెస్టులను మాత్రమే నిర్వహించనునందని, కేవలం దీనికే పరిమితం అవుతుందని, కోర్సు ప్రవేశం కొరకే పరీక్షలను నిర్వహించనుందంటూ, ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు నిర్వహించే పరీక్షల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
NTA Job Notification: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల వేతనం
మంగళవారం అంటే.. 17 డిసెంబర్ నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మెరకు వచ్చే ఏడాది 2025లో ఎన్‌టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి వివరించారు.
సీయూఈటీ..
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్- యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్‌టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి.
ఈ విద్యార్థి మాత్రమే..
దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో ప్రవేశించే విద్యార్థి మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష రాసేలా డిజి-యాత్ర మాదిరిగానే డిజి-ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసింది.
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు
2025 నుంచి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026-27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- NTA
- Entrance Exams
- central government
- students education
- recruitment exams
- entrance exams for students
- National Testing Agency
- University Admissions
- NEET
- medical seats
- medical colleges admissions
- students entrance exams
- universities admission tests
- Union Education Minister Dharmendra Pradhan
- High-level government committee
- Common University Entrance Test
- online entrance exams
- digital exams for students admissions
- digi exams
- NCERT Books
- reduce cost of ncert books
- Central government decision
- key decision of central govt
- key decision of central govt for entrance exams
- Education News
- Sakshi Education News
- NationalTestingAgency
- CommonEntranceTests
- JobSelectionExams