Semester Exam Results: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Sakshi Education
వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) 3వ, 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీంబాషా మంగళవారం విడుదల చేశారు.
Semester Exam Results
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ సెమిస్టర్‌లో 79.4 శాతం ఫలితాలు, 5వ సెమిస్టర్‌లో 91.4 శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల విభాగం అధికారులు రాఘవేంద్ర, డా. సుబ్రమణ్యం, హరిత, నాగమునిరెడ్డి, గురుమోహన్‌రెడ్డి, ఎం.వి.రమణ, శచీదేవి పాల్గొన్నారు.