Merit List Released: వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ.. అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
Sakshi Education
నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా ఖాళీగా ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు ఇటీవల కాంట్రాక్ట్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Merit List Released for various posts in health department
వివరాలను ఎస్పీఎస్‌నెల్లూరు.ఏపీ.జీఓవీ.ఇన్/నోటీసు/రిక్రూట్‌మెంట్ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తుదారులు తమ అభ్యర్థనలను బుధ, గురువారాల్లో సాయంత్రం 5 గంటల్లోపు లిఖితపూర్వకంగా తగిన ఆధారాలతో సమర్పించాలని కోరారు.