AP Staff Nurse Merit List Released: ‘స్టాఫ్ నర్స్’ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
కడప రూరల్: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు.
AP Staff Nurse Merit List Released
ఈ జాబితాను సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోపు తమ అభ్యర్థనలను తెలపాలని సూచించారు. 28వ తేదీన ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వివరించారు.