Skip to main content

Staff Nurse Recruitment: స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు కార్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆర్డీ డాక్టర్‌ కె.సుచిత్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Application invitation for 44 staff nurse posts in Guntur, Prakasam, and Nellore districts  vDeadline for Guntur Medical staff nurse applications: January 1 to 15  Staff Nurse Recruitment  Guntur Medical staff nurse recruitment notice
Staff Nurse Recruitment

ఉద్యోగాలకు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ, బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను జనవరి 17 నుంచి 23వ తేదీలోపు పరిశీలించి, 24న మెరిట్‌ లిస్టు, 29న ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కె.పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. కౌన్సెలింగ్‌ జనవరి 30, 31వ తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులు అందజేయాలని వెల్లడించారు.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఆరు పోస్టులు, బాపట్ల ఏరియా ఆసుపత్రిలో పది, నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో 24, ఆత్మకూరు, కందుకూరు, రాపూరు, గురజాలలో ఒక్కొక్కటి చొప్పున స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.


ముఖ్యసమాచారం:

మొత్తం పోస్టులు: 44
ఖాళీల వివరాలు: స్టాఫ్‌ నర్స్‌

Degree Semester Exam Results: డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

విద్యార్హత: బీఎస్సీ నర్సింగ్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 15 వరకు సా. 5గంటలలోపు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
(గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మీ దరఖాస్తును అందజేయాలి)

Highly Paid Medical Courses: 10వ తరగతి పాస్‌ అయితే చాలు.. ఈ మెడికల్‌ కోర్సులు చేస్తే భారీ జీతాలు

మెరిట్‌ లిస్టు విడుదల: జనవరి 24న 
కౌన్సెలింగ్‌ : జనవరి 30,31

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Jan 2025 10:13AM

Photo Stories