Nursing Jobs in Abroad: నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. జీతం నెలకు. 90వేల వరకు..
Sakshi Education
పాడేరు : సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగాలకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, యూసఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. రోహిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Nursing Jobs in Abroad
బీఎస్సీ నర్సింగ్ పూర్తి అయి ఉండి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు గల అభ్యర్థులు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎంపికై న వారికి నెలకు రూ.78 వేల నుంచి రూ.89 వేలు, మెడికల్ ఇన్సూరెన్స్, ఇతర అలవెన్సులు చెల్లిస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 9949927899ను సంప్రదించాలని ఆమె కోరారు.