Skip to main content

Nursing Jobs 2024: నర్సింగ్‌ ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ. 3 లక్షలకు పైనే..

క్రోసూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీ), ఓఎంసీఏపీ, క్యూరా పర్సనల్‌ సంయుక్తంగా జర్మన్‌ భాషలో శిక్షణతో పాటు ఆ దేశంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి తమ్మాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఏఎం, బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో పాటు వయస్సు 35 సంవత్సరాలలోపు ఉండాలని పేర్కొన్నారు. దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి రెండేళ్లు, జీఏఎం చదివిన వారికి మూడేళ్ల అనుభవం ఉండాలని తెలిపారు.
Nursing Jobs jobs in Japan  Training in German language for job opportunities in Germany  Job training in Germany for candidates under 35 years with experience
Nursing Jobs jobs in Japan

అభ్యర్థులు జర్మనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆరు నెలలు పాటు గుంటూరు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో శిక్షణ ఉంటుందని తెలిపారు. జర్మన్‌ భాషలో శిక్షణ ఏ1, ఏ2, బీ1, బీ2 స్థాయిలుంటాయని పేర్కొన్నారు.కాషన్‌ డిపాజిట్‌గా రూ.75వేలు లేదా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు క్యూరాపర్సనల్‌ వారికి సబ్మిట్‌ చెయ్యాలని తెలిపారు.

Spot Admissions 2024: బీఈడీ కోర్సులో స్పాట్‌ అడ్మిషన్స్‌

పూర్తి హాజరుతో శిక్షణ విజయవంతంగా ముగించిన అభ్యర్థులకు ఆ డిపాజిట్‌ తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ రెసిడెన్షియల్‌, డే స్కాలర్స్‌లో ఉంటుందన్నారు. భోజనం, వసతితో పాటు ట్రాన్స్‌లేషన్‌ రుసుం అభ్యర్థులే చెల్లించాలని తెలిపారు. వీసా వచ్చిన తర్వాత క్యూరా వారు తిరిగి చెల్లిస్తారన్నారు.బీ2 పరీక్ష ఫీజు మొదటిసారిగా హాజరయ్యే సమయంలో అభ్యర్థులు చెల్లించాలని వెల్లడించారు.

Apprentice Mela At ITI College: నేడు ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్‌షిప్‌మేళా

ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు రూ.2,33,000, నుంచి రూ. 3,26,000 వరకు భారత కరెన్సీ ప్రకారం ఉంటుందని వివరించారు. ఈనెల 10 వ తేదీకల్లా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. http//gormrfe/k3he7 nxcke5htacu8 లింక్‌పై క్లిక్‌ చేయాలని తెలిపారు. వివరాలకు 77029212219ను సంప్రదించాలని సూచించారు.


ముఖ్య సమాచారం:

విద్యార్హత: జీఏఎం, బీఎస్సీ నర్సింగ్‌
వయస్సు: 35

పని అనుభవం: 2-3 ఏళ్లు
ట్రైనింగ్‌ సమయం: ఆరు నెలలు

వేతనం: రూ.2,33,000, నుంచి రూ. 3,26,000 వరకు 
వివరాలకు: 77029212219

రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్‌ 10

Published date : 09 Dec 2024 03:13PM

Photo Stories