Skip to main content

Jobs In Health Department: వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

గుంటూరు మెడికల్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా డైక్‌ సెంటర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి గురువారం తెలిపారు. మెడికల్‌ ఆఫీసర్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, సోషల్‌ వర్కర్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
Jobs In Health Department Vacancies for Medical Officer, Dental Technician, Physiotherapist, and Social Worker at Guntur District Medical and Health Department
Jobs In Health Department Medical and Health Department jobs

అభ్యర్థులు దరఖాస్తులను గుంటూరు.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చని చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 13 నుంచి 30వ తేదీలోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోగానీ, రిజిస్టరు పోస్టు ద్వారాగానీ అందజేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300లు, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.500లు దరఖాస్తుతోపాటు డీడీ లేదా యూపీఐ పేమెంట్‌ ద్వారా చెల్లించాలన్నారు.

331 వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ | Walk in Interview for 331  Medical Posts | Sakshi

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ అర్హతతో రూ.25వేల వేతనం..

డీడీ ద్వారా ఫీజు చెల్లించేవారు గుంటూరు మెడికల్‌ కాలేజీలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో డీడీ తీయాలని తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

Jobs: 2,118 పోస్టుల మంజూరు.. మరో మూడు కొత్త కళాశాలల | Sakshi Education

Physical Tests For AP Constables: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెలలోనే ఫిజికల్‌ టెస్టులు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా ప్యాలేటీవ్‌ కేర్‌ ఉద్యోగానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. తెనాలి జిల్లా ఆసుపత్రిలో జనరల్‌ ఫిజీషియన్‌ పోస్టు ఖాళీగా ఉందన్నారు. అభ్యర్థులు విద్యార్హతలు, దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఈ నెల 19న జనరల్‌ ఫీజిషియన్‌ ఉద్యోగానికి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 13 Dec 2024 03:43PM

Photo Stories