Medical Officer Posts : 354 మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ,పీఎస్‌టీలో ప్రతిభ ఆధారంగా ఎంపిక!
కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్–ఎ హోదాలో మెడికల్ ఆఫీసర్ కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఎంపికైతే నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం పొందొచ్చు. ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ తాజాగా మెడికల్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది! ఈ నేపథ్యంలో.. ఐటీబీపీ మెడికల్ ఆఫీసర్స్ పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, భవిష్యత్తు అవకాశాలు తదితర సమాచారం..
కేంద్ర సాయుధ దళాల్లో వైద్యులది ఎంతో కీలక పాత్ర. భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలాంటి వారికి తక్షణం వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమిస్తోంది. డాక్టర్లుగా కేంద్ర ప్రభుత్వ కొలువులు కోరుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Russia and Pakistan: పాకిస్తాన్, రష్యా సైనికాధికారుల భేటీ
మొత్తం పోస్టుల సంఖ్య 345
కేంద్ర సాయుధ దళాలుగా పేర్కొనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, అసోం రైఫిల్స్ విభాగాల్లో మూడు హోదాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి కేంద్ర హోంశాఖ శ్రీకారం చుట్టింది. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్(సెకండ్ ఇన్ కమాండ్)–5 పోస్టులు,స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్)–176 పోస్టులు, మెడికల్ ఆఫీసర్స్ (అసిస్టెంట్ కమాండెంట్)–164 పోస్టులకు నియామకాలు చేపట్టనుంది.
☛ Join our Telegram Channel (Click Here)
విద్యార్హతలు
● సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్స్: నిర్దేశిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి. అదే విధంగా పీజీ తర్వాత డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్
(డీఎం) తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సూపర్ స్పెషాలిటీ విభాగంలో మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
● స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు ఏడాదిన్నర పని అనుభవం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతోపాటు రెండున్నరేళ్ల పని అనుభవం ఉండాలి.
● మెడికల్ ఆఫీసర్స్: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఇంటర్వ్యూ సమయానికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకోవాలి.
November Month School Holidays 2024 : వచ్చే నవంబర్ నెలలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవే...! తెలుగు రాష్ట్రాల్లో మాత్రం...
వయసు
సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్స్‌కు 50 ఏళ్లు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్స్‌కు 30 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ–నాన్‌క్రీమీ లేయర్ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున మినహాయింపు ఇస్తారు.
ప్రత్యేక నియామక బోర్డ్
సాయుధ దళాల్లోని వైద్య విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్ట్‌ల భర్తీకి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా.. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ మెడికల్ ఆఫీసర్స్ సెలక్షన్ బోర్డ్–2024 పేరుతో ప్రత్యేక రిక్రూట్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దరఖాస్తు నుంచి నియామకాల ఖరారు వరకు అన్ని వ్యవహారాలను ఈ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
రెండు దశల ఎంపిక ప్రక్రియ
మెడికల్ ఆఫీసర్స్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అవి.. పర్సనల్ ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అకడమిక్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు
రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా పోస్ట్‌ల భర్తీ క్రమంలో..అకడమిక్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను క్రోడీకరించి..ఒక్కో పోస్ట్‌కు ముగ్గురు లేదా నలుగురిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
Teaching Posts : సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ తమిళనాడులో 23 టీచింగ్ పోస్టులు
200 మార్కులకు ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో అభ్యర్థులకు వైద్య రంగంలో ఉన్న అనుభవం, పరిజ్ఞానం, సామాజిక దృక్పథం, మేథో ప్రజ్ఞ, నాయకత్వ లక్షణాలు, నిజాయితీ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఇలా ఇంటర్వ్యూకు ఎంపిక చేసే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఇందులో కనీస అర్హత మార్కుల నిబంధనను కూడా విధించారు. కనీసం 40 శాతం (80 మార్కులు)తో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే వారిని తదుపరి దశ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
పీఎస్‌టీ ఇలా
ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. మరుసటి రోజు రెండో దశగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 157.5 సెంటీ మీటర్ల ఎత్తు, మహిళా అభ్యర్థులు 142 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా.. పురుష అభ్యర్థులు ఛాతీ కొలత 77 సెంటీ మీటర్లు ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 82 సెంటీ మీటర్లు ఉండాలి. తర్వాత దశలో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. అన్నింటిలోనూ నిబంధనల మేరకు ఉంటే నియామకం ఖరారు చేస్తారు.
☛ Follow our Instagram Page (Click Here)
ఆకర్షణీయ వేతనం
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్‌ను గ్రేడ్–2 హోదాలో (సెకండ్ ఇన్ కమాండ్ స్థాయి) నియమిస్తారు. పే లెవల్–12లో రూ.78,800–రూ.2,09, 200 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం ఉంటుంది. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్‌ను గ్రేడ్–2 (జూనియర్ టైమ్ స్కేల్)లో నియమిస్తారు. వీరికి డిప్యూటీ కమాండెంట్ హోదా కల్పిస్తారు. పే లెవల్–11లో రూ.67,700–రూ.2,08,700తో ప్రారంభ వేతనం ఇస్తారు. మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌కు ఎంపికైన వారికి అసిస్టెంట్ కమాండెంట్ హోదా కల్పిస్తారు. వీరికి పే లెవల్–10లో రూ.56,100–రూ.1,77,500 శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది. ఆయా పోస్టుల్లో నియామకం ఖరారు చేసుకున్న వారు భవిష్యత్తులో అత్యున్నత హోదాలకు చేరుకోవచ్చు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, నవంబర్ 14
ఇంటర్వ్యూ తేదీ: 2025 జనవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in
Tags
- Medical Officer Posts
- job notification 2024
- Jobs 2024
- MBBS MD Course students
- medical jobs
- second in command level
- online applications deadline
- super speciality medical officer
- specialists medical officers
- mbbs passedout students
- postgraduate diploma candidates
- Group-A in Central Armed Forces
- Central Armed Forces
- medical field recruitments 2024
- Education News
- Sakshi Education News
- Medical Officer recruitment 2024
- Group-A medical positions
- Central Armed Forces healthcare
- Specialist Medical Officer
- Medical career in ITBP
- CAPF medical jobs
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024