Russia and Pakistan: పాకిస్తాన్, రష్యా సైనికాధికారుల భేటీ
ఈ సమావేశంలో భద్రత, రక్షణ రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్న ఇరు దేశాలు, రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వీ ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమయ్యారు.
పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. రష్యాతో సంప్రదాయ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, పీఏఎఫ్ పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఇరుదేశాల మధ్య ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Asia-Pacific Conference: ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్’ సదస్సు
అదనంగా.. పాకిస్తాన్ బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. బ్రిక్స్‌లో సభ్యదేశంగా మారేందుకు రష్యాకు విజ్ఞప్తి చేయడం, గత ఏడాది దరఖాస్తు చేసినప్పటికీ కజాన్‌లో జరిగిన సమావేశానికి ఆహ్వానం పొందకపోవడం గమనార్హం. భారత్ వ్యతిరేకత కారణంగా పాకిస్తాన్‌కు బ్రిక్స్‌లో సభ్యత్వం కల్పించబడలేదు.
Tags
- Pakistan Army
- Inter-Services Public Relations
- Brics Summit
- COAS General Asim Munir
- Pakistan
- Russia
- International news
- Sakshi Education Updates
- Pakistan-Russia relations
- Military Cooperation
- Russian Deputy Defense Minister
- Pakistan armed forces
- International relations
- Defense partnership
- Security collaboration