Skip to main content

Starship: స్టార్‌షిప్‌ ప్రయోగం పాక్షికంగా విజయవంతం

స్పేస్‌ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ ఐదో ప్రయోగం విజయవంతమైంది.
SpaceX Starship rocket launch in Texas on November 19  SpaceX launches sixth Starship mission partially successful, booster explodes in the ocean

చంద్రుడితోపాటు అంగారక గ్రహంపై భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం స్పేస్‌ఎక్స్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘స్టార్‌షిప్‌’ రాకెట్‌కు సంబంధించిన ఆరో ప్రయోగాన్ని న‌వంబ‌ర్ 19వ తేదీ టెక్సాస్‌లో నిర్వహించారు. 
 
ఈ ప్రయోగంలో ఒక దశ విఫలమైనప్పటికీ, మరో దశ విజయవంతంగా పూర్తయింది. ప్రయోగాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్ స్వయంగా వీక్షించారు.

ప్రయోగంలో 400 అడుగుల(121 మీటర్లు) పొడవున్న స్టార్‌షిప్ రాకెట్‌ను స్పేస్‌ఎక్స్‌ లాంచ్‌ప్యాడ్‌ నుంచి ప్రయోగించారు. 33 శక్తివంతమైన రాప్టర్‌ ఇంజన్లను మండించి, రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది సేపట్లో, స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి సూపర్‌ హెవీ బూస్టర్‌ విజయవంతంగా విడిపోయి, భూమి వైపు తిరిగింది.

ISRO-SpaceX: స్పేస్‌ ఎక్స్‌తో ఇస్రో తొలి ప్రయోగం విజయవంతం

అయితే.. బూస్టర్‌ను కాపాడుకునే ప్రయత్నం సాంకేతిక సమస్య కారణంగా విఫలమైంది. దీంతో, బూస్టర్‌ గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో సముద్రంలో కూలిపోయింది.

అదే సమయంలో.. స్టార్‌షిప్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ 90 నిమిషాలపాటు భూమిచుట్టూ ప్రయాణించి, చివరగా హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్‌ సంస్థ తమ సోషల్‌ మీడియాలో పంచుకుంది. గత నెలలో జరిగిన స్టార్‌షిప్ ఐదో ప్రయోగం విజయవంతమయ్యింది.

Hypersonic Missile: దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం.. దీని ప్రత్యేకతలు ఇవే..

Published date : 21 Nov 2024 03:31PM

Photo Stories