ISRO PSLV C60: ఇస్రో పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగం విజయవంతం

అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం, విడదీత సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వేసిన తొలి అడుగు విజయవంతమైంది. స్పేస్ డాకింగ్ (స్పేడెక్స్) ప్రయోగంలో భాగంగా పీఎస్‌ఎల్‌వీ–సీ60 రాకెట్ ద్వారా ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించాయి. ఈ ప్రయోగం భారతదేశం అంతరిక్ష పరిశోధనలో కీలకమైన అడుగును వేయడంతో, డాకింగ్ టెక్నాలజీకి భారత దేశం చేరువవ్వడంపై ప్రపంచం కన్నేశింది.
స్పేడెక్స్ మిషన్ యొక్క రెండో దశలో జంట ఉపగ్రహాలను అనుసంధానం (డాకింగ్) చేయడం ముఖ్యమైన లక్ష్యంగా ఉంది. ఈ ప్రక్రియ జనవరి 7న చేపట్టబడే అవకాశముందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. డాకింగ్ ప్రక్రియ విజయవంతమైతే, అమెరికా, చైనా, రష్యా తర్వాత అతి సంక్లిష్టమైన ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.
ప్రయోగం వివరాలు..
➤ పీఎస్‌ఎల్‌వీ–సీ60 రాకెట్ తిరుపతి జిల్లా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2 నిమిషాల ఆలస్యంతో డిసెంబర్ 30 ఉదయం 10 గంటలకు భూమి నుంచి ప్రయాణం ప్రారంభించింది.
➤ ఈ ప్రయోగంలో 15.15 నిమిషాలకు టార్గెట్ ఉపగ్రహం, 15.20 నిమిషాలకు ఛేజర్ ఉపగ్రహం 470 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నూతన సెమీ మేజర్ యాక్సిస్ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపడ్డాయి.
POEM-4 in PSLV-C60: పీఎస్ఎల్‌వీ సీ60లో పీఎస్-4తో విభిన్న ప్రయోగాలు
స్పేడెక్స్ ప్రయోజనాలు ఇవే..
➤ ఈ టెక్నాలజీ ప్రధానంగా స్పేస్ సర్వీసులు, స్పేస్ స్టేషన్ నిర్మాణం, మానస సహిత గగన్‌యాన్, చంద్రయాన్–4 వంటి ప్రయోగాలకు ఉపయోగపడుతుంది.
➤ స్పేడెక్స్ ప్రయోగం ద్వారా, ఇస్రో అనుసంధాన పరిజ్ఞానం పెంచుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలో మరింత ముందుకు వెళ్లింది.
ఈ ఉపగ్రహాలు 220 కిలోలు బరువు కలిగి ఉంది. ఇవి రెండేళ్ల పాటు సేవలందిస్తాయి.
- అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి స్పేడెక్స్ ప్రయోగం తొలి అడుగు.
- రోదసీలో వ్యోమనౌకల మధ్య వస్తు మార్పిడి తదితరాలకు డాకింగ్ టెక్నాలజీ వీలు కల్పిస్తుంది.
- ఇస్రో చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఎంతో దోహదపడుతుంది.
- చంద్రయాన్–4. ద్వారా చంద్రుడి ఉపరితలంపై సేకరించిన నమూనాలను భూమికి తేవడాన్ని సులభతరం చేస్తుంది. ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూల్స్‌ను పంపి భూమి, చంద్రుడి కక్ష్యలో డాకింగ్ చేయనున్నారు.
- కక్ష్యలో ఉపగ్రహాల మరమ్మతులు, వాటిలో ఇంధనం నింపడం తదితరాలకు ఉపయోగపడుతుంది.
- ఈ టెక్నాలజీ వల్ల ఉపగ్రహాల జీవితకాలమూ పెరుగుతుంది.
- జంట ఉపగ్రహాల్లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా మెరుగైన భూ పరిశీలనకు తోడ్పడుతుంది.
- మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ మానవసహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడుతుంది.
Parker Solar Probe: చరిత్ర సృష్టించిన ‘నాసా’ స్పేస్‌క్రాఫ్ట్.. సూర్యుడి ‘కరోనా’ను తాకింది!!