US President Elections: అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు.. చరిత్రలో ఇదే తొలిసారి..!
అమెరికాలో మైనారిటీ వర్గమైన హిందువులు ఒకేసారి నలుగురు దిగువసభకు ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆరుగురు భారతీయ మూలాలున్న వ్యక్తులు ఈసారి దిగువసభ ఎన్నికల్లో గెలవగా వారిలో నలుగురు హిందువులు.
గెలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో క్రైస్తవేతర, యూదుయేతర మతవిశ్వాసం ఉన్న వ్యక్తులు కేవలం 14 మంది మాత్రమే. వీరిలో హిందువులు నలుగురు, ముస్లింలు నలుగురు, బౌద్ధులు ముగ్గురు, ఏ మతాన్ని ఆచరించని వాళ్లు ముగ్గురు ఉన్నారు.
హిందువులు సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, రో ఖన్నా, శ్రీ థానేదార్ తాజాగా ఎన్నికల్లో విజయపతాక ఎగరేశారు.
భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ ప్రమీలా జయపాల్ తన మతం ఏమిటనేది పేర్కొనలేదు. భారతీయ మూలాలున్న మరో సీనియర్ దిగువసభ సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా దేవుడొక్కడే అనే విశ్వాసాన్ని తాను నమ్ముతానని చెప్పారు. ‘‘12 ఏళ్ల క్రితం నేను దిగువసభలో ప్రమాణంచేసేటపుడు నేనొక్కడినే భారతీయఅమెరికన్‌ను. ఇప్పుడు మా బలం ఆరుకు పెరిగింది’’ అని అమీబెరీ అన్నారు.
మొత్తం సభ్యుల్లో క్రైస్తవులదే మెజారిటీ కాగా 31 మంది(ఆరు శాతం) యూదు మతస్థులున్నారు. గెలిచిన రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 98 శాతం మంది, డెమొక్రటిక్ పార్టీ సభ్యుల్లో 75 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.
Indian American: ట్రంప్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్.. ఈయన ఎవరంటే..
స్పీకర్‌గా మళ్లీ మైక్
52 ఏళ్ల మైక్ జాన్సన్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా మళ్లీ ఎన్నికయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి జనవరి 3వ తేదీ ఎన్నికలు నిర్వహించగా ఆయన కేవలం 3 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు.ఇది గత వంద సంవత్సరాల చరిత్రలో అత్యంత తక్కువ మెజారిటీతో గెలిచిన స్పీకర్‌గా నిలిచింది.
దిగువసభలో 219 మంది రిపబ్లికన్లు ఉండగా, 215 మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈయనకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 215 మంది పడ్డాయి.
Tags
- Indian Americans
- Raja Krisnamoorthi
- Shri Thanedar
- Ro Khanna
- US elections
- US President Elections
- Mike Johnson
- House speaker
- Sakshi Education Updates
- US Presidential Election 2025
- Hindus in US House of Representatives
- Historic win for Hindus in US
- Indian-Americans in US government
- US Elections 2025 results
- Hindu politicians in America
- International news
- SakshiEducationUpdates