GSAT-20: స్పేస్ ఎక్స్‌తో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్

అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం జీశాట్20 (GSAT N2) అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇదే తొలి ప్రయోగం..
స్పేస్‌ఎక్స్ ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. జీశాట్20 బరువు సుమారు 4,700 కేజీలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంఛ్ వెహికల్స్ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఆ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్20ను నింగిలోకి మోసుకెళ్లింది.
Hypersonic Missile: దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం.. దీని ప్రత్యేకతలు ఇవే..
ఇస్రో లక్ష్యం..
అడ్వాన్స్‌డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. అంతేకాదు.. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా ఈ జీశాట్20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది.
Ballistic Missile: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణి పరీక్ష..