Skip to main content

EU to Trump on Tariffs: ఈయూపై 25 శాతం సుంకాలు

అమెరికా సుంకాల దెబ్బ యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)నూ తాకింది.
Donald Trump threatens 25 percent tariffs on EU

ఈయూ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ తొలి కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. 

‘27 దేశాలున్న ఈయూ అమెరికా కార్లు, వ్యవసాయోత్పత్తులను అంగీకరించదు. కానీ మేం మాత్రం వారి నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్‌ కార్ల దిగుమతులపై మేం విధిస్తున్న దానికంటే ఇది 4 రెట్లు ఎక్కువ’ అంటూ మండిపడ్డారు. అసలు అమెరికాను ఇరుకున పెట్టేందుకే ఈయూ పుట్టిందని ట్రంప్‌ ఆరోపించారు. 

గట్టిగా బదులిస్తాం: ఈయూ
ట్రంప్‌ వ్యాఖ్యలపై ఈయూ కార్యనిర్వాహక విభా గమైన యూరోపియన్‌ కమిషన్‌ దీటుగా స్పందించింది. ‘మాది ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా విపణి. అమెరికాకు ఈయూ వరం. చట్టబద్ధం, వివక్షారహితం అయిన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే ఈయూ గట్టిగా బదులిస్తుంది’ అని కమిషన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. 

Gold Card: త్వ‌ర‌లో అమల్లోకి రానున్న 'గోల్డ్‌ కార్డు' పథకం

అమెరికా, ఈయూ ఉద్రిక్తతలు
రెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెర దించేందుకు 1993లో ఈయూ ఏర్పాటైంది. అమెరికా కూడా దీన్ని ఓ చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ రెండింటి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్‌ రాకతో ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూ టర్న్‌ తీసుకోవడంతో కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉక్రెయిన్‌ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలోనూ రష్యాకు అను కూలంగా అమెరికా నిలవడం నివ్వెరపరిచింది. ఈ యూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్య టిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా సమయాభావం సాకుతో అది రద్దయింది!

Gold Card Visa: ట్రంప్‌ సంచలన ప్రకటన.. పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసా.. ఈబీ-5 వీసా అంటే?
Published date : 01 Mar 2025 09:57AM

Photo Stories