Skip to main content

Ballistic Missile: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణి పరీక్ష..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, బలీయమైన ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ (ఐసీఎంబీ)ను పరీక్షించామని న‌వంబ‌ర్ 1వ తేదీ ఉత్తరకొరియా ప్రకటించింది.
North Korea fires intercontinental ballistic missile test

అయితే.. నిపుణులు ఈ పరీక్ష వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో ఈ మిస్సైల్‌ ఉపయుక్తకరంగా ఉండబోదని అభిప్రాయపడ్డారు. అమెరికాను చేరుకోగల క్షిపణులను అభివృద్ధి చేయడంలో ఉత్తరకొరియాకు సాంకేతిక అడ్డంకులున్నాయని వారు సూచించారు.
 
తాము పరీక్షించిన ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్‌–19.. ఎన్నడూ లేనంత దూరం, ఎత్తులో ప్రయాణించిందని ఉత్తరకొరియా ప్రకటించింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ పరీక్షను దగ్గరుండి పరిశీలించారు. 

రష్యా, అమెరికా వద్దనున్న అత్యాధునిక ఖండాంతర క్షిపణుల పొడవు 20 మీటర్ల లోపే ఉంటుందని, హ్వాసాంగ్‌–19 పొడవు 28 మీటర్లు ఉండటం మూలంగా.. ప్రయోగానికి ముందుగానే దీన్ని దక్షిణకొరియా నిఘా సంస్థలు కనిపెట్టగలిగాయని దక్షిణకొరియా వ్యూహ నిపుణుడు చాంగ్‌ యంగ్‌–కెయున్‌ తెలిపారు. ల్యాంచ్‌పాడ్ల పరిమాణం పెరుగుతుందని, పొడవు అధికంగా ఉన్నందువల్ల శత్రుదేశాల నిఘా రాడార్లకు ఈ తరహా క్షిపణులు సులభంగా చిక్కుతాయని వివరించారు.  

Shenzhou 19 Mission: ‘డ్రీమ్‌’ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన చైనా

ఇంకా.. అమెరికా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 8,000 ఉత్తరకొరియా సైనికులు ఉన్నారని వెల్లడించింది. రష్యా సరిహద్దుల్లో ఈ సైనికులను మోహరించడం ద్వారా ఉక్రెయిన్‌ సేనల పైన ప్రగతి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Published date : 02 Nov 2024 01:08PM

Photo Stories