Skip to main content

Shenzhou 19 Mission: ‘డ్రీమ్‌’ మిషన్‌ను లాంచ్‌ చేసిన చైనా

చైనా తన డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19ను విజయవంతంగా ప్రయోగించింది.
Shenzhou-19 launch at Jiuquan Satellite Launch Center  China Launches Three Astronauts To Tiangong Space Station on Shenzhou 19 Mission

అక్టోబర్ 30వ తేదీ తెల్లవారు జామున 4:27 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ మిషన్, ముగ్గురు వ్యోమగాములతో సహా ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్‌ను తీసుకెళ్ళింది.

షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన 10 నిమిషాల అనంతరం, వ్యోమగాములు క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ ప్రకటించింది.

ఈ మిషన్‌లో మిషన్ కమాండర్ కై జుబే, వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే ఇప్పటికే అనుభవజ్ఞుడైన వ్యోమగామి 2022లో షెంజౌ-14 మిషన్‌లో పాల్గొన్నాడు. వాంగ్ హవోజ్, చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్, ఇది ఆమె మూడవ అంతరిక్ష యాత్ర.

SpaceX Launch: స్టార్‌షిప్‌ ఐదో బూస్టర్‌ ప్రయోగ పరీక్ష సక్సెస్.. లాంచ్‌ప్యాడ్‌పై తొలిసారి..

Published date : 30 Oct 2024 01:09PM

Photo Stories