Skip to main content

PM Rashtriya Bal Puraskar: పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపికైన‌ మంగళగిరి క్రీడాకారిణి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌కు ప్రతిష్ఠాత్మక ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ వరించింది.
Matrapu Jessi Raj was selected for the PM Rashtriya Bal Puraskar

ఈ పురస్కారాన్ని దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. తాజా జాబితాను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

14 ఏళ్ల జెస్సీరాజ్‌ ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కేటింగ్‌లో శిక్షణ ఆమె తొమ్మిదో ఏట నుంచి ప్రారంభించింది. తల్లిదండ్రులు రాధ, సురేష్‌ల ప్రోత్సాహం, కోచ్‌ సింహాద్రి సూచనలతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 50 పతకాలు, బహుమతులు సాధించింది.

ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్‌లో జరిగిన పోటీల్లో ‘ఇన్‌లైన్‌ ఫ్రీ స్కేటింగ్‌’ విభాగంలో బంగారు పతకం సాధించి తన ప్రతిభను చాటింది. సెస్సీరాజ్ ప్ర‌స్తుతం అంతర్జాతీయ స్కేటింగ్‌ వేదికపై రాణిస్తోంది. 

ఈ పురస్కారాన్ని జెస్సీరాజ్‌  డిసెంబర్‌ 26వ తేదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.

Award: పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు

Published date : 21 Dec 2024 05:41PM

Photo Stories