Skip to main content

Vladimir Putin: విమాన ప్రమాదంపై అజెర్‌బైజాన్‌కు పుతిన్‌ ‘సారీ’

కజకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబ‌ర్ 28వ తేదీ అజెర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇలాహ్మ్‌ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారు.
Vladimir Putin apologises over Azerbaijan Airlines crash   Russian President Putin apologizes to Azerbaijani President Ilham Aliyev for Kazakhstan plane crash

అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్‌ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం డిసెంబ‌ర్ 25న‌ అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించారు. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్‌ క్షమాపణ చెప్పడం గమనార్హం. 

ఈ విమాన ప్రమాదానికి.. రష్యా గగనతల రక్షణ వ్యవస్థ (Air Defense Systems)ని బాధ్యుడిగా పేర్కొనే ఆరోపణలు వున్నప్పుడు, పుతిన్‌ ఈ ప్రమాదానికి బాధ్యత తమదేనని ప్రత్యేకంగా అంగీకరించలేదు. అయితే, క్రెమ్లిన్‌ ఒక ప్రకటనలో అజెర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండవ్వడానికి అనేకసారి ప్రయత్నించడంతో, రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి అని తెలిపింది. ఈ కాల్పుల కారణంగా విమానం కూలిందనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు.

రష్యా గగనతలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై పుతిన్‌ అజెర్‌బైజాన్‌ ప్రెసిడెంట్‌ అలియేవ్‌కు క్షమాపణలు చెప్పినట్టు క్రెమ్లిన్ పేర్కొంది. అజెర్‌బైజాన్‌ అధ్యక్షుడి కార్యాలయం కూడా ఈ క్షమాపణలను ధ్రువీకరించింది. 

Year Ender 2024: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలు ఇవే..

Published date : 30 Dec 2024 01:00PM

Photo Stories