Lashkar-e-Taiba: అంతర్జాతీయ ఉగ్రవాది.. అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి
మధుమేహం ముదిరిపోవడంతో, అతడు కొంతకాలంగా లాహోర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిసెంబర్ 27వ తేదీ వేకువజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. ఇతడు జమాత్ ఉద్ది–దవా (Jamaat-ud-Dawa) అనే నిషేధిత ఉగ్రవాద సంస్థకు ఉపాధ్యక్షుడు.
ఉగ్రవాద నిధుల కేసులో..
హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కి ఉగ్రవాద నిధుల కేసులో 2020లో ఆరు నెలల జైలు శిక్ష పొందాడు. 2023లో, ఐక్యరాజ్యసమితి ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీనితో, మక్కి పై ఆస్తుల సీజ్, ప్రయాణ నిషేధం, మరియు ఆయుధ నిషేధం అమలులో ఉన్నాయి. అప్పటి నుండి అతడు బహిరంగంగా కనిపించడం మానేసి, జమాత్ ఉద్ దవా పేరుతో విరాళాలు సేకరించడం, కొత్త సభ్యులను చేర్చుకోవడం మొదలుపెట్టాడు.
Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత
ముంబై దాడులకు సంబంధించి, 2008 డిసెంబర్ 26న, సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా భారత్‌లోకి ప్రవేశించిన ముష్కరులు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. ఈ దాడులను హఫీజ్ సయీద్ ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్‌లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.