Skip to main content

Vladimir Putin: మోదీ నాకు మంచి మిత్రుడన్న రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి.
'PM Modi Is A Warm Friend', Vladimir Putin Hails India-Russia Ties

భారత ప్రధానమంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచదేశాల అధినేతల్లో తనకున్న కొద్ది మంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరని అన్నారు.
 
పుతిన్‌ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశంలో మాట్లాడారు. మోదీతో పాటు జర్మనీ మాజీ చాన్స్‌లర్‌ హెల్ముత్‌ కోల్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాక్విస్‌ చిరక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మాట్లాడడం ఇష్టమని, వారంతా తనకు మంచి స్నేహితులని చెప్పారు. కుదిరితే వారితో టీ సేవిస్తూ సంభాషించడానికి ఇష్టపడతానని వెల్లడించారు.

PM Modi: ఈ ఏడాది ప్రధాని మోదీ పర్యటించిన దేశాలు ఇవే..

ఈ సమావేశంలో.. బ్రిక్స్‌ కూటమి గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా కాకుండా, కూటమి సభ్యదేశాల ప్రయోజనాలను రక్షించడానికి మాత్రమే పనిచేస్తున్నారని వివరించారు. ఈ కూటమిలో భాగమైన బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, భారత్‌ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. 

Published date : 21 Dec 2024 12:11PM

Photo Stories