Cancer Vaccine: ఆరు నెలల్లో మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్
Sakshi Education
భారతదేశంలోని మహిళలకు మరో ఆరు నెలల్లో క్యాన్సర్ టీకాను అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ ఫిబ్రవరి 18వ తేది వెల్లడించారు.

9–16 ఏళ్ల గ్రూపు వారు ఈ టీకాకు అర్హులని చెప్పారు. టీకాకు సంబంధించిన పరిశోధనలు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు.
ప్రస్తుతం బ్రెస్ట్, నోటి, సెర్వికల్ కేన్సర్‌లపై టీకా ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. మన దేశంలో కేన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం పలు చర్యలను చేపట్టిందని ఆయన అన్నారు. మహిళల్లో 30 ఏళ్లు పైబడిన వారు ఆస్పత్రుల్లో ముందుగానే స్క్రీనింగ్ చేయించు కోవాలని సూచించారు.
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆధార్ లింకు ఉంటేనే ఈపీఎఫ్ ప్రోత్సాహకాలు
Published date : 19 Feb 2025 03:25PM