Top GK Current Affairs (August 16th-31st) Quiz in Telugu: ఆగస్టు 16న ఇస్రో శాస్త్రవేత్తలు ఏ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు?
Science & technology
1. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్) ను మరో పేరుతో ఏమని పిలుస్తారు?
ఎంపికలు: a) బ్లడ్ ఫీవర్
b) ఐ బ్లీడింగ్ వైరస్
c) హెమరేజిక్ ఫీవర్
d) కాంగో ఫీవర్
- View Answer
- Answer: B
2. ఆగస్టు 29వ తేదీన విశాఖ నేవల్ డాక్‌యార్డులో నేవీలోకి ప్రవేశపెట్టబడిన అరిహంత్ క్లాస్‌లో రెండోదైన అణు జలాంతర్గామి ఏది?
ఎంపికలు: a) ఐఎన్ఎస్ అరిహంత్
b) ఐఎన్ఎస్ అరిఘాత్
c) ఐఎన్ఎస్ విక్రాంత్
d) ఐఎన్ఎస్ కల్వరి
- View Answer
- Answer: B
3. ఆగస్టు 16న ఇస్రో శాస్త్రవేత్తలు ఏ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు?
ఎంపికలు: A) పీఎస్ఎల్వీ
B) జీఎస్ఎల్వీ
C) ఎస్ఎస్ఎల్వీ డీ3
D) ఎల్విఎం3
- View Answer
- Answer: C
4. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఎంత మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది?
ఎంపికలు: a) 2 వేల మెగావాట్లు
b) 3 వేల మెగావాట్లు
c) 4 వేల మెగావాట్లు
d) 5 వేల మెగావాట్లు
- View Answer
- Answer: C
5. ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ‘ఓరల్ కలరా వ్యాక్సిన్’ (OCV) ను ఏ పేరుతో ప్రారంభించింది?
ఎంపికలు: a) కోవాక్సిన్
b) హిల్చోల్
c) బయోచోల్
d) కలరాచోల్
- View Answer
- Answer: B
6. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా భారతదేశం ఏ తేదీని “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా జరుపుకుంటుంది?
ఎంపికలు: a) ఆగస్టు 15
b) ఆగస్టు 23
c) సెప్టెంబర్ 5
d) అక్టోబర్ 2
- View Answer
- Answer: B
7. ఈ ఏడాది జాతీయ అంతరిక్ష దినోత్సవం థీమ్ ఏమిటి?
ఎంపికలు: a) ‘భారత అంతరిక్ష ప్రయాణం’
b) ‘చంద్రుని తాకడం’
c) ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం: భారతదేశ అంతరిక్ష సాగా’
d) ‘అంతరిక్షంలో భారతదేశం’
- View Answer
- Answer: C
Sports
8. ప్రపంచ సబ్‌జూనియర్, జూనియర్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఎవరు?
ఎంపికలు: a) షేక్ సాధియా ఆల్మాస్
b) పి.వి. సింధు
c) సైనా నెహ్వాల్
d) మేరీ కోమ్
- View Answer
- Answer: A
National
9. ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది?
ఎంపికలు: a) కేరళ
b) తమిళనాడు
c) అసోం
d) మహారాష్ట్ర
- View Answer
- Answer: C
10. ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు?
ఎంపికలు: a) తెలుగు భాషా దినోత్సవం
b) హిందీ భాషా దినోత్సవం
c) కన్నడ భాషా దినోత్సవం
d) తమిళ భాషా దినోత్సవం
- View Answer
- Answer: A
11. ఏపీలో రూ.2,786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో, రూ.2,137 కోట్లతో కొప్పర్తిలో ఏ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి?
ఎంపికలు: a) గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు
b) సౌర విద్యుత్ ప్లాంట్లు
c) హైడ్రోపవర్ ప్రాజెక్టులు
d) రైల్వే స్టేషన్లు
- View Answer
- Answer: A
Economy
12. నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ (NHPC), సట్లజ్ జల విద్యుత్ నిగమ్ (SJVN), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI), రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (RCIL)కు ఏ హోదా లభించింది?
a) మహారత్న
b) మినీరత్న
c) నవరత్న
d) సూపర్ రత్న
- View Answer
- Answer: C
13. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకు గవర్నర్లలో ఎవరు అత్యుత్తమ బ్యాంకర్‌గా నిలిచారు?
a) జెరోమ్ పావెల్
b) క్రిస్టిన్ లాగార్డే
c) శక్తికాంత దాస్
d) హారుహికో కురోడా
- View Answer
- Answer: C
International
14. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘నిషాన్-ఎ-ఇమ్తియాజ్’ను ఎవరికీ అందజేశారు?
a) చైనా అధ్యక్షుడు
b) చైనా పీఎల్ఏ నేవీ కమాండర్
c) చైనా పీఎల్ఏ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్
d) చైనా రక్షణ మంత్రి
- View Answer
- Answer: C
15. ఇటీవల అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో ఏ దేవుని 90 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించారు?
a) గణేశుడు
b) హనుమంతుడు
c) శివుడు
d) విష్ణువు
- View Answer
- Answer: B
16. పేటోంగ్టార్న్ షినవత్ర ఎవరి కుమార్తె?
A) యింగ్లక్ షినవత్ర
B) థాక్సిన్ షినవత్ర
C) ప్రాయుత్ చాన్-ఓ-చా
D) అనుపోంగ్ పావ్జిందా
- View Answer
- Answer: B
Important Days
17. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
a) ఆగస్టు 15
b) ఆగస్టు 20
c) సెప్టెంబర్ 5
d) అక్టోబర్ 2
- View Answer
- Answer: B
18. ప్రపంచ దోమల దినోత్సవం-2024 యొక్క థీమ్ ఏమిటి?
a) ‘మలేరియాపై విజయం’
b) ‘మలేరియాను నిర్మూలించడం’
c) ‘మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం’
d) ‘మలేరియాపై అవగాహన’
- View Answer
- Answer: C
Awards
19. సింగం శ్రీకాంత్ పాణిని ఏ సంస్థ నుంచి అవార్డు అందుకున్నారు?
A) ISRO
B) NASA
C) ESA
D) JAXA
- View Answer
- Answer: B