Chinmoy Krishna: బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు.. ఖండించిన భారత్
కృష్ణదాస్‌ను అరెస్టు చేసి, బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే తాజాగా ఘటన జరగడంపై ఆందోళనకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. మైనార్టీలపై కాల్పులు, దోపిడీ, దొంగతనం. వ్యాపార సంస్థల్లో విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఇలాంటి దుర్మార్గాలకు కారణమైన వారిని కాకుండా.. శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్‌ల కోసం పనిచేస్తున్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని పేర్కొంది.
Israel PM Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్..!
విమానాశ్రయంలో అరెస్టు..
బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్‌లోని ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పోలీసులు రిమాండ్‌కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. నిర్బంధ సమయంలో అతనికి అన్ని మతపరమైన అధికారాలను మంజూరు చేయాలని ఆదేశించింది.
అయితే.. కృష్ణదాస్ గత అక్టోబర్‌లో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తిలో ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండాను ఎగురవేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణదాస్‌తోపాటు మరో 18 మందిని అరెస్ట్ చేసి దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో కృష్ణదాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి
New CAG of India: 'కాగ్' బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారి ఈయనే..