Retirement Age: రిటైర్మెంట్ వయసు పెంపు.. జనవరి నుంచి అమల్లోకి.. ఎన్నేళ్లంటే..!
Sakshi Education
తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్దులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్న చైనా వచ్చే సంవత్సరం నుంచి అక్కడి కార్మికుల రిటైర్మెంట్ వయసును 63 ఏళ్లకు పెంచనుంది.
ప్రస్తుతం అక్కడి మగవాళ్లు 60 సంవత్సరాలకు రిటైర్ అవుతుండగా దానిని మరో మూడేళ్లు పెంచారు. ఇక కార్మికులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయసు ఇన్నాళ్లూ 50 ఏళ్లుకాగా దానిని 55 ఏళ్లు పెంచారు.
వృత్తి నిపుణుల వంటి వైట్‌కాలర్ ఉద్యోగాలు చేసే మహిళల రిటైర్మెంట్ వయసును 55 నుంచి 58 సంవత్సరాలకు పొడిగించారు. రిటైర్మెంట్ వయసును మారుస్తూ తీసుకున్న నిర్ణయం 15 ఏళ్లకుపైగా అమల్లో ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని చైనా అధికార టీవీఛానల్ సీసీటీవీ ఒక కథనం ప్రసారం చేసింది.
Published date : 16 Sep 2024 08:04AM