Delhi Elections: ఢిల్లీలో బీజేపీ గెలిస్తే.. గర్భిణులకు రూ.21 వేలు, మహిళలకు రూ.2,500, రూ.500కే సిలిండర్

జె.పి.నడ్డా జనవరి 17వ తేదీ ఢిల్లీలో బీజేపీ సంకల్స్ పత్రంలోని(మేనిఫెస్టో) మొదటి భాగాన్ని విడుదల చేశారు.
మహిళల సంక్షేమానికి ప్రత్యేక హామీలు
మహిళా సమృద్ధి యోజన: బీజేపీ ప్రభుత్వంలో ప్రతి మహిళకు ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించాలనే ప్రణాళికను ప్రకటించారు.
గర్భిణుల ఆర్థిక సాయం: గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని నడ్డా తెలిపారు.
వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ: పేద కుటుంబాలకు 500 రూపాయల ధరకు వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని, హోలీ, దీపావళి పండుగలకు ఊచితంగా ఒక్కొక్కటి సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
వృద్ధుల, వితంతువుల, వికలాంగుల సంక్షేమం:
వృద్ధుల పెన్షన్: 60-70 ఏళ్ల వృద్ధులకు 2,000 నుంచి 2,500 రూపాయల పెన్షన్ పెంచుతామని, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్ పెంచుతామని ప్రకటించారు.
వితంతువులు, వికలాంగులు: 70 ఏళ్ల పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రత్యేక పెన్షన్ పెంపు కూడా అమలు చేస్తామని తెలిపారు.
PM Modi in AP: ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..
ఆరోగ్య సంక్షేమం:
ఆయుష్మాన్ భారత్ పథకం: ఢిల్లీలో 51 లక్షల మందికి ఆరోగ్య రక్షణ అందించడానికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని, ఢిల్లీ ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయల ఆరోగ్య రక్షణతో మొత్తం 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుందని పేర్కొన్నారు.
ఆటల్ క్యాంటీన్ యోజన: మురికివాడల పేదలకు 5 రూపాయలకు పౌష్టికాహారం అందించేందుకు ఆటల్ క్యాంటీన్ యోజన కింద ప్రకటించారు.
సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి:
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమం, సుపరిపాలన, మహిళల గౌరవం, యువత అభివృద్ధి, రైతుల సాధికారత, శ్రామిక వర్గాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ నడవడిక ఉంటుందని నడ్డా తెలిపారు.