Skip to main content

Yoon Suk Yeol: దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్

డిసెంబర్‌లో ప్రజాపాలనకు వ్యతిరేకంగా అత్యయిక స్థితి (మార్షల్‌ లా) విధించిన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్ యోల్‌ను దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
South Korean President Yoon Suk Yeol Arrested

ఈ అరెస్ట్‌కు సంబంధించిన సందిగ్ధత కొద్దిరోజులుగా కొనసాగినప్పటికీ, జనవరి 15వ తేదీ తెల్లవారుజామున అరెస్ట్ జరిగిందని వెల్లడైంది.

దర్యాప్తు అధికారులు, అవినీతినిరోధక దర్యాప్తు సిబ్బంది, పోలీసులు, సైన్యం కలిసి సెంట్రల్ సియోల్లోని అధ్య‌క్షుడి నివాస భవనం వద్ద పరిగెత్తి, యూన్‌ సుక్‌ యోల్‌ను అరెస్ట్ చేశారు. అయితే, మొదట అధ్యక్ష భద్రతాబలగాలు తీవ్రంగా ప్రతిఘటన చూపగా, దర్యాప్తు బృందం చిట్టచివరకు అదుపులోకి తీసుకుంది.

భద్రతా బలగాలు ముందుగా బస్సులు, బ్యారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి, దర్యాప్తు బృందాన్ని అడ్డుకున్నాయి. అయినప్పటికీ, దర్యాప్తు బృందం నిచ్చెనల సాయంతో బ్యారికేడ్లు దాటించి, గోడలు ఎక్కి, ముళ్ల కంచెలను కత్తిరించి ముందుకు సాగింది. చివరికి, 1,000 మందితో కూడిన బృందం అధికారిక నివాసం లోపలికి చేరుకుంది.

Joseph Aoun: లెబనాన్‌ నూతన అధ్యక్షుడిగా జోసెఫ్‌ ఔన్‌

యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్‌ సందర్భంగా ఆయన దక్షిణకొరియా చరిత్రలో పదవిలో ఉండి అరెస్ట్‌ అయిన తొలి అధ్యక్షుడిగా నిలిచిపోయారు.

కస్టడీ, కోర్టు అనుమతి.. 
యూన్ పై తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నం అన్న అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగా, 48 గంటల్లో కోర్టు అనుమతి పొందకుండా ఆయనను అరెస్ట్ చేయడం కానుకాదు. లేకపోతే, అతనిని మళ్లీ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రామాణిక అరెస్ట్ కింద, 20 రోజులపాటు ఆయనను అదుపులో ఉంచవచ్చు.

Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా

Published date : 17 Jan 2025 09:20AM

Photo Stories