Indian Economy: 2026 నాటికి 4వ అతిపెద్ద ఎకానమీగా భారత్

2026 నాటికి భారతదేశం జపాన్‌ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని వారి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారతదేశం 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని, ఇది ఆర్‌బీఐ, ప్రభుత్వ అంచనాలకన్నా అధికంగా ఉందని పేర్కొన్నారు.
2025–26 ఆర్థిక సంవత్సరం కోసం పీహెచ్‌డీసీసీఐ 7.7 శాతం వృద్ధి అంచనాకు వచ్చింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2025న లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను సమర్పించను సమర్పించనున్నారు.
Union Budget: కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..
ఈ నేపథ్యంలో.. పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు హేమంత్ జైన్ చేసిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవే..
పన్ను రేట్ల సవరణ: ప్రస్తుతం రూ.15 లక్షల పైగా ఆదాయం ఉన్న వారికి 30% పన్ను రేటు వర్తిస్తోంది. ఈ పన్ను రేటు రూ.40 లక్షలపై ఆదాయం పొందే వారికే వర్తించాలి అని పీహెచ్‌డీసీసీఐ సూచించింది.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు: ప్రస్తుతం రూ.2.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సూచన వచ్చింది.
Indian Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.6 శాతం