Skip to main content

IND W vs IRE W: వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత జట్టు.. ఐర్లాండ్‌ను 304 రన్స్‌ తేడాతో..

భారత మహిళల క్రికెట్‌ జట్టు మూడో వన్డేలో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది.
Ind W vs Ire W, 3rd ODI: India registers largest margin of win in 304-run victory over Ireland

ఐర్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టుతో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. అంతేకాదు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

జ‌న‌వ‌రి 15వ తేదీ జరిగిన చివరి వన్డేలో భారత్ 304 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు సాధించింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (129 బంతుల్లో 154; 20 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (80 బంతుల్లో 135: 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు తొలి వికెట్కు 26.4 ఓవర్లలో 233 పరుగులు జోడించారు. రిచా ఘోష్ (42 బంతుల్లో 59, 10 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్థ సెంచరీతో రాణించింది. 

ఈ ఫార్మాట్‌లో జట్టు తొలిసారి 400 పరుగుల మార్కును చేరుకుంది. ఆనంతరం ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్ప కూలింది. సారా ఫోర్బ్స్ (41), ప్రెండర్‌గాస్ట్‌(36) మాత్రమే కొద్దిగా పోరాడారు. దీప్తి శర్మకు 3 వికెట్లు దక్కాయి. 

'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన ప్రతీక రావల్ మొత్తం 310 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును కూడా గెలుచుకుంది.

అత్యధిక స్కోరు
వన్డేల్లో భారత మహిళల జట్టు అత్యధిక స్కోరు 435/5. గత వన్డేలో చేసిన 371/5 స్కోరును జట్టు సవరించింది. ఓవరాల్‌గా వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్-3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4 2018లో ఐర్లాండ్‌: 455/5:19975 : 440/3: 2018లో ఐర్లాండ్‌పై) పేరిటే ఉండటం విశేషం.

Sitanshu Kotak: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కొటక్

  • 304 పరుగుల తేడా వరంగా వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.
     
  • సెంచరీకి స్మృతి తీసుకున్న బంతుల సంఖ్య 70. గతంలో హర్మన్ ప్రీత్ (87 బంతులు) పేరిట ఉన్న భారత రికార్డును స్మృతి బద్దలు కొట్టింది.
  • ప్రతీక రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188). హర్మన్ ప్రీత్ (171 నాటౌట్) ఆమె కంటే ముందున్నారు.
     
  • భారత్ తరఫున ఒకే మ్యాచ్లో ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో మిథాలీ రాజ్. రేష్మ గాంధీ (1999లో ఐర్లాండ్ పై).. దీప్తి శర్మ, పూనమ్ రౌత్ (2017లో ఐర్లాండ్) ఈ ఫీటు నమోదు చేశారు.
  • స్మృతికి వన్డేల్లో ఇది 10వ సెంచరీ, అత్యధిక శతకాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో మెగ్ లానింగ్ (15: ఆస్ట్రేలియా). సుజీ బేట్స్ (13: న్యూజిలాండ్) ఆమెకంటే ముందున్నారు.
     
  • కెరీర్ తొలి 6 ఇన్నింగ్స్‌లో కలిపి ప్రతీక రావల్ చేసిన పరుగులు 444. గతంలో చార్లోట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) 434 పరుగులు చేసింది. 
  • భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధిక రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. 
  • ఐర్లాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలిచింది.

Sports Awards: తెలుగు తేజాలు దీప్తి, జ్యోతిలకు ‘అర్జున’ అవార్డు

Published date : 18 Jan 2025 11:08AM

Photo Stories