Skip to main content

World Bank: వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి

భారత్‌ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) భారత వృద్ధి రేటు 6.7 శాతం సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక పేర్కొంది.
World Bank Projects India's Growth At 6.7% For Next Two Fiscal Years

దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. 

భారత్‌ను మినహాయించి.. దక్షిణాసియా ప్రాంతం 2024లో సుమారు 3.9% వృద్ధి రేటును నమోదు చేయవచ్చని అంచనా ఉంది. ఈ వృద్ధి బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా అడ్డుకుంటున్నట్లయితే, పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. ఇది అనుకూల సంకేతాలు ఇవ్వడం వలన ఈ దేశాలలో వృద్ధి రేటు పుంజించుకోవచ్చు. 

దక్షిణాసియా సమగ్రంగా 2025లో 4%, 2026లో 4.3% వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయబడింది.

ఇక చైనా.. 2024లో 5% వృద్ధి నమోదు చేసింది. 2023లో చైనా వృద్ధి 5.2%తో ఉన్నప్పటికీ, 2024లో ఇది కాస్త తగ్గింది. అయితే.. ఈ వృద్ధి రేటు చైనా ప్రభుత్వ అంచనాల మేరకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Indian Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.6 శాతం

Published date : 20 Jan 2025 08:38AM

Photo Stories