Crude Oil: ఈ దేశాల నుంచి భారత్‌కి పెరిగిన ముడి చమురు దిగుమతులు..
Sakshi Education
భారత దేశానికి ముడి చమురు ఎగుమతిదారుల్లో నిన్న మొన్నటివరకూ రష్యాదే అగ్రస్థానం.

కానీ, ఇప్పుడు రష్యాలో దేశీయంగా వాడకం పెరగడంతో ఆ దేశం నుంచి మనకు దిగుమతులు తగ్గుతున్నాయి. దాని స్థానంలో పశ్చిమాసియా దేశాలైన ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. 2024 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో రష్యా నుంచి దిగుమతులు తగ్గాయి. అదే సమయంలో ఇరాక్ నుంచి, యూఏఈ నుంచి పెరిగాయి. దీనికి సంబంధించిన ఆధారం కమాడిటీ మార్కెట్ ఎనలిటిక్ సంస్థ కెప్లర్ ద్వారా తెలిసింది.
మనదేశానికి దిగుమతుల శాతం ఇదే..
దేశం | నవంబర్ | డిసెంబర్ |
---|---|---|
రష్యా | 38 | 31.5 |
ఇరాన్ | 18.7 | 24 |
సౌదీ అరేబియా | 13.3 | 13.8 |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 9.2 | 11.2 |
ఇతర దేశాలు | 20.8 | 19.5 |
Published date : 13 Jan 2025 12:55PM