Skip to main content

Power Subsidy: చేనేతలకు 500 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Free Power Scheme for Handloom Weavers Families in Andhra Pradesh

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 26వ తేదీ ఉత్తర్వులు జారీచేసింది.  

గ‌తంలో ఇచ్చిన హామీ మేరకు, చేనేత కార్మికుల ఇళ్లకు నెలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా, పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు, రాష్ట్ర విద్యుత్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలతో పాటు, 10,534 పవర్ లూమ్ యూనిట్లు కూడా లబ్ధిపడతాయి.

Groundwater Level: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు

కానీ, ఈ పథకంలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ పరిమితి కంటే చేనేత కుటుంబాలు లేదా పవర్ లూమ్ యూనిట్లు అధికంగా విద్యుత్ వినియోగిస్తే, అదనంగా వాడిన యూనిట్లకు వినియోగదారులు ఖచ్చితంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

Konda Laxman Bapuji Handloom Awards: చేనేత కార్మికులకు అవార్డులు.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

Published date : 27 Mar 2025 01:55PM

Photo Stories