Skip to main content

World Children’s Day: నవంబర్ 20వ తేదీ ప్రపంచ బాలల దినోత్సవం

ప్ర‌తి సంవ‌త్స‌రం నవంబర్ 20వ తేదీ ప్రపంచ బాలల దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.
World Children's Day 2024: History and theme

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ అంకితం చేయబడింది. పిల్లల హక్కులు, వారి సంక్షేమం, భవిష్యత్తు గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

2024 సంవత్సరం థీమ్.. "భవిష్యత్తును వినండి. బాలల హక్కుల కోసం నిలబడండి(Listen to the Future. Stand Up for Children’s Rights)".

ఈ థీమ్ బాలల స్వరాలను పెంచి, వారి హక్కులు, ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రాధాన్యతనిచ్చి, మరింత సమానమైన, సమగ్రమైన భవిష్యత్తును సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

Important Days: నవంబర్ 2024లో ముఖ్యమైన రోజులు ఇవే..

ప్రపంచ పిల్లల దినోత్సవం చరిత్ర ఇదే..
1954లో యూనివర్సల్ చిల్డ్రన్స్ డేగా స్థాపించబడింది. 1959లో యూనిటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిల్లల హక్కుల ప్రకటనను నవంబర్ 20న ఆమోదించింది. అలాగే.. 1989లో ఈ రోజే పిల్లల హక్కుల కాన్వెన్షన్ను కూడా యూని జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

1990 నుంచి ప్రపంచ పిల్లల దినోత్సవం పిల్లల హక్కుల ప్రకటన, పిల్లల హక్కుల కాన్వెన్షన్‌ను ఆమోదించిన తేదీని కూడా గుర్తుచేసుకుంటూ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం నవంబర్ 20వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కలయిక, పిల్లలలో అవగాహన పెంచడం, పిల్లల సంక్షేమం మెరుగుపరచడం కోసం నిర్వహించబడుతుంది.

United Nations Day: అక్టోబర్ 24వ తేదీ ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

Published date : 21 Nov 2024 05:50PM

Photo Stories