United Nations Day: అక్టోబర్ 24వ తేదీ ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఏడాది ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం (ఐక్యరాజ్యసమితి) దినోత్సవంగా నిర్వహిస్తారు.
2024 థీమ్ ఇదే..
2024 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి రోజుకు "ఉత్తమ భవిష్యత్తు కోసం గ్లోబల్ కోఆపరేషన్(Global Cooperation for a Better Future)" అనే థీమ్‌ను నిర్ణయించారు. ఇది శాంతి, భద్రత, అభివృద్ధి కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రాముఖ్యంగా చూపిస్తుంది. సభ్యదేశాలకు గ్లోబల్ సవాళ్లను అధిగమించడంలో వారి భాగస్వామ్య బాధ్యతను గుర్తుచేస్తుంది.
ఈ రోజు చరిత్ర..
★ 'యునైటెడ్ నేషన్స్' అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ ఉపయోగించారు.
October Important Days: అక్టోబర్ నెలలోని జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు ఇవే..
★ యూఎన్‌లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది.
★ ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి.
దీని ప్రాముఖ్యత:
★ ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ.
★ అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
World Food Day: అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..