World Meditation Day: డిసెంబర్ 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం
Sakshi Education
ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది.
‘సర్వజనుల శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! ఏటా డిసెంబర్ 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకొచ్చిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది.
లీచెన్‌స్టయిన్, భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు.
Important Days: డిసెంబర్‌లో జరుపుకునే ముఖ్యమైన రోజులు ఇవే..
Published date : 09 Dec 2024 11:43AM