Sajjan Jindal: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్

మార్చి 25వ తేదీ నాటికి కంపెనీ యొక్క మార్కెట్ విలువ రూ.2,59,670 కోట్లు (సుమారు 30.5 బిలియన్ డాలర్లు) చేరింది. ఈ విలువతో ఆర్సెలర్ మిత్తల్ (రూ.2.13 లక్షల కోట్లు / 24.79 బిలియన్ డాలర్లు), నిప్పన్ స్టీల్ (రూ.1.98 లక్షల కోట్లు / 23.08 బిలియన్ డాలర్లు) వంటి అంతర్జాతీయ పెద్ద సంస్థలను అధిగమించింది. దేశీయంగా, టాటా స్టీల్ (రూ.1.95 లక్షల కోట్లు), సెయిల్ (రూ.47,000 కోట్లు)ను కూడా మించినట్లు గమనించవచ్చు.
ఈ ఏడాది జనవరిలోంచి ఇప్పటివరకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్‌లు 18% పెరిగాయి. ఇది నిఫ్టీ 50 సూచీలో అత్యుత్తమ ప్రదర్శనని అందుకున్న వాటిలో ఒకటి.
3D Printed Train: ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్.. ఎక్కడంటే..
మార్కెట్ విలువ ఆధారంగా.. టాప్-10 జాబితాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తరువాత టాటా స్టీల్‌నే భారతదేశం నుంచి ఏకైక సంస్థగా నిలిచింది. టాటా స్టీల్ 22.9 బిలియన్ డాలర్ల విలువతో ఐదో స్థానంలో ఉంది.
టాప్-5 ఉక్కు కంపెనీల జాబితా..
- జేఎస్‌డబ్ల్యూ స్టీల్ – 30.5 బిలియన్ డాలర్లు
- న్యూకోర్ స్టీల్ – 29.4 బిలియన్ డాలర్లు
- ఆర్సెలర్ మిత్తల్ – 24.79 బిలియన్ డాలర్లు
- నిపాన్ స్టీల్ – 23.08 బిలియన్ డాలర్లు
- టాటా స్టీల్ – 22.9 బిలియన్ డాలర్లు
QS Rankings: ప్రపంచవ్యాప్తంగా.. టాప్ 50 విద్యాసంస్థల్లో 9 భారతదేశానివే.. ఆ విద్యాలయాలు ఇవే..