Skip to main content

Kalpana Chawla: కల్పనా చావ్లా.. రెండు పుట్టిన రోజుల వ్యోమగామి

అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయ మూలాలు కలిగిన మహిళగా కల్పనా చావ్లా పేరొందారు.
Kalpana Chawla Birth Anniversary

ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆమె పుట్టిన రోజు విషయంలో విరుద్ధ వాదన వినిపిస్తుంది. ఆమె పుట్టిన తేదీ 1962 మార్చి 17 అని కొందరు.. కాదు కాదు 1961, జూలై ఒకటి అని కొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది సరైనదో ఇక్క‌డ తెలుసుకుందాం.

కల్పనా చావ్లా హర్యానాలోని కర్నాల్‌లో 1962, మార్చి 17వ తేదీ జన్మించారు. బాల్యంలో ఆమె విమానాలన్నా, విమాన ప్రయాణాలన్నా ఎంతో ఆసక్తి చూపేది. ఈ ఆసక్తితోనే ఆమె తన తండ్రితో పాటు స్థానిక ఫ్లయింగ్‌ క్లబ్‌కు తరచూ వెళుతుండేది. అక్కడి విమానాలను చూసి మురిసిపోతుండేది. తరువాత ఆమె అమెరికా చేరుకుని, 1991లో అమెరికా పౌరసత్వం పొందింది.
 
మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమె 1962, మార్చి 17న జన్మించింది. అయితే కల్పనా మెట్రిక్‌ పరీక్షకు హాజరయ్యే సమయానికి ఆమె వయస్సు సరిపోకపోవడంతో ఆమె తండ్రి ఆమె పుట్టిన తేదీని 1961, జూలై ఒకటిగా అధికారికంగా మార్పించారు. దీంతో ఆమె మెట్రిక్‌ పరీక్షకు హాజరు కాగలిగింది.

Kusuma Dharmanna: మార్చి 17న తొలిత‌రం ద‌ళిత క‌వి కుసుమ ధర్మన్న జయంతి

అమెరికాలోని రికార్డులలో ఆమె పుట్టిన తేదీ 1961 జూలై ఒకటిగానే ఉంటుంది. నాసా అధికారిక రికార్టులలోనూ ఆమె పుట్టినరోజు జూలై ఒకటి అని కనిపిస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ఆమె పుట్టినరోజును మార్చి 17నే నిర్వహించుకుంటారు.

కల్పనా చావ్లా పంజాబ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి ఎయిరోనాటిక్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1982లో అమెరికా చేరుకుని, అక్కడి యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి ఎయిరోస్సేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. 1986లో ఆమె మరో మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. తరువాత పీహెచ్‌డీ చేశారు. 

2023 జనవరి 16న కల్పనా చావ్లా.. నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షానికి చేరుకున్నారు. తరువాత ఆమె భూమికి తిరిగి రాలేకపోయారు. కల్పనా ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక 2023 ఫిబ్రవరి ఒకటిన భూమికి తిరిగి వస్తుండగా, కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కల్పనా చావ్లాతో పాటు మొత్తం ఏడుగురు వ్యోమగాములు మృతి చెందారు.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 17 Mar 2025 03:22PM

Photo Stories