Indian Navy Day: డిసెంబర్ 4వ తేదీ ఇండియన్ నేవీ డే
భారతదేశంలో రక్షణ వ్యవస్థలో నావికాదళం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం సమయంలో భారత నేవీ సాధించిన విజయాలు, ప్రత్యేకంగా ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా దేశానికి గుర్తింపు తెచ్చాయి.
1971లో ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో.. భారత నేవీ ఆపరేషన్ ట్రైడెంట్ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, 1971 డిసెంబర్ 4వ తేదీన భారత నేవీ కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసింది. ఇందులో భాగంగా PNS ఖైబర్ సహా నాలుగు పాకిస్థాన్ నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఈ దాడిలో 500 మందికి పైగా పాకిస్థాన్ నేవీ సిబ్బంది చనిపోయారు.
Important Days: డిసెంబర్‌లో జరుపుకునే ముఖ్యమైన రోజులు ఇవే..
ఇందులో భాగంగా.. భారత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ వీర్ కీలక పాత్ర పోషించాయి. గుజరాత్‌లోని ఒఖా పోర్టు నుంచి బయలుదేరిన భారత నౌకలు కరాచీ పోర్టు పై దాడి చేశాయి, దాంతో పాక్ నేవీకి భారీ నష్టం వాటిల్లింది. ఐఎన్ఎస్ వీర్ మిస్సైల్ దాడితో పాక్ యుద్ధనౌక ముహఫిజ్ సముద్రంలో ముంచిపోయింది. ఇందులో ఉన్న 222 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది థీమ్ ఇదే.. “ఇన్నోవేషన్, స్వదేశీకరణ ద్వారా బలం, సామర్థ్యం(Strength and Capability through Innovation and Indigenization)”. ఈ థీమ్.. రక్షణ సాంకేతికతలలో స్వదేశీకరణ, ఆవిష్కరణ ద్వారా భారత నేవీ శక్తిని పెంచడం లక్ష్యంగా ఉంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ (స్వయం-విశ్వాసం కలిగిన భారత్) దృష్టిని అనుసరిస్తుంది, దీని ద్వారా భారతదేశంలో మెరుగైన సముద్ర భద్రత మరియు కార్యాచరణ సామర్థ్యం పెరుగుతాయి.
World Disability Day: నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..