Skip to main content

November Month School Holidays 2024 : ఈ న‌వంబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే...! తెలుగు రాష్ట్రాల్లో మాత్రం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌తి ఏడాది న‌వంబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు త‌క్కువ‌గానే ఉంటాయి. కానీ ఈ ఏడాది న‌వంబ‌ర్ 2024లో స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వులు ఎక్కువ‌గా రానున్నాయి.
Schools and Colleges Holidays 2024

గ‌త అక్టోబర్‌లో స్కూల్ విద్యార్థులకు ద‌స‌రా, భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వరుసగా సెలవులు వ‌చ్చిన విష‌యం తెల్సిందే. అయితే 2024 నవంబర్‌లో మొత్తం 12 రోజుల సాధారణ సెలవులు రాబోతున్నాయి. ఈ సమయంలో దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, బ్యాంకులు సెల‌వులు రానున్నాయి. దీంతో స్కూల్, కాలేజీల విద్యార్థులు మ‌రోసారి సెల‌వుల‌తో ఎంజాయ్ చేయ‌నున్నారు.

న‌వంబ‌ర్ నెల‌లో రానున్న సెల‌వులు ఇవే...
నవంబర్ 2024లో సెల‌వులు ఎక్కువ‌గానే రానున్నాయి. నవంబర్ ప్రారంభం నుంచి అనేక ప్రత్యేక పండుగలు ఉంటాయి. మళ్లీ నెల మధ్యలో, నెలాఖరులో అనేక ప్రత్యేక రోజులు ఉంటాయి. అందుకే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ఉండవచ్చు. దీపాల పండుగతో ప్రారంభించి, ఈ నవంబర్‌లో దీపావళి, గోవర్ధన్ పూజ, భైఫొంటా, ఛత్ పూజ, కార్తీక పూర్ణిమ వంటి ప్రత్యేక రోజులు జరుపుకుంటారు. ఈ రోజుల్లో చాలా స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులు, బ్యాంకులకు సెల‌వులు ఇవ్వ‌నున్నారు. అయితే ఈ సెలవుల జాబితా రాష్ట్రం, నగరాన్ని బట్టి భిన్నంగా ఉండవచ్చు. న‌వంబ‌ర్ 9వ తేదీన రెండో శ‌నివారం, అలాగే న‌వంబ‌ర్ 23వ తేదీన నాల్గోవ శ‌నివారం.. ఈ రెండు రోజుల్లో కూడా చాలా స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు ఉన్న విష‌యం తెల్సిందే.

➤☛ Good News Four Days Holidays 2024 : దీపావళికి వ‌రుస‌గా 4 రోజులు పాటు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఇంకా..!

నవంబర్ 1వ తేదీన‌ శుక్రవారం కుట్, పుదుచ్చేరి విమోచన దినం, హర్యానా దినోత్సవం, కర్ణాటక రాజ్యోత్సవ్, కేరళ పైరవి వంటి ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ఉంటాయి. నవంబర్ 1న‌ మణిపూర్, పుదుచ్చేరి, హర్యానా, కర్ణాటక, కేరళలో ప్రభుత్వ సెలవుదినం. ఈ రోజు అన్ని పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి. నవంబర్ 2వ తేఈ పలు పండగల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెలవులు ఉంటాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సెలవులు ఉండవచ్చు. అలాగే నవంబర్ 3న సెలవు దినం. ఈ రోజు ఆదివారం కావడంతో వారాంతపు సెలవు ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని కాలేజీలు, పాఠశాలలు, బ్యాంకులు మొదలైనవి ఈ రోజున సెల‌వులు  ఉంటుంది. దీంతో వ‌రుస‌గా సెల‌వులు రానున్నాయి.

☛➤ TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ...

నవంబర్ 7,8వ తేదీల్లో సెల‌వు..? ఎక్క‌డంటే..?
వంగళ పండుగ సందర్భంగా నవంబర్ 8, శుక్రవారం మేఘాలయలో సెలవు ఉంటుంది. నవంబర్ 10 తర్వాత ఎప్పుడు సెలవు వస్తుంది. ఆదివారం నవంబర్ 10న దేశమంతటా వారాంతపు సెలవు ఉంటుంది. ప్రకాష్ పర్వ్ అంటే గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15 శుక్రవారం సెలవు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆదివారం, నవంబర్ 17 ప్రభుత్వ సెలవు దినం. ఈ రోజు దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం...
కనక్ దాస్ జయంతి సందర్భంగా, నవంబర్ 18 సోమవారం కర్ణాటకలో సెలవుదినం. నవంబర్ 22 శుక్ర‌వారం లహబ్ దుచెనే. ఈ సందర్భంగా సిక్కింలో సెలవు ఉంటుంది. నవంబర్ 23 శనివారం ఓ ప్రత్యేక రాష్ట్ర పండగ సందర్భంగా మేఘాలయలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు. ఆ తర్వాత వచ్చే ఆదివారం 24 నవంబర్ మరో సాధారణ సెలవుదినం. ఈ రోజున దేశం మొత్తం వారాంతపు సెలవు ఉంటుంది. అయితే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  మాత్రం స్కూల్స్‌, కాలేజీల‌కు ఈ న‌వంబ‌ర్ నెల‌లో త‌క్కువ‌గా సెల‌వులు ఉన్నాయి.

 ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

అయితే.. ఈ సెలవులు రాష్ట్రం, నగరం, పాఠశాలల వారీగా మారవచ్చు. కాబట్టి పాఠశాల, కాలేజీల విద్యార్థులు స్కూల్స్‌, కాలేజీల‌ డైరీని తనిఖీ చేసుకోని సెల‌వు తీసుకోండి.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు...

Published date : 05 Nov 2024 12:13PM

Photo Stories